బట్టలూడదీసి కొడతానన్న పవన్ కల్యాణ్... తేరగా ఉన్నాం రమ్మనండి అంటూ అంబటి కౌంటర్

వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఏ క్రిమినల్స్ అయితే ప్రజలను ఏడిపించారో వాళ్లను బట్టలూడదీసి కొడతాం అంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. 

వారాహిపై వచ్చిన పవన్ ఊగిపోతున్నాడని మండిపడ్డారు. "మొన్న చెప్పు తీసుకుని కొడతా అన్నాడు. మేమందరం రౌడీలం అంట... ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీద గుడ్డలూడదీసి కొడతాడంట. కొట్టించుకోవడానికి తేరగా ఉన్నాం... రమ్మనండి. ఇదేమైనా సినిమా అనుకున్నాడా? అదుపుతప్పి మాట్లాడుతున్నాడు. అవగాహన లేదు, పరిపక్వత లేదు, రాజకీయాలంటే తెలియదు, రాజకీయాలంటే సినిమా షూటింగులు అనుకునే పరిస్థితిలో ఉన్న ఆయన రాజకీయాల గురించి మాట్లాడతాడు" అని అంబటి విమర్శించారు.

Ambati Rambabu
Pawan Kalyan
YSRCP
Janasena
Varahi Yatra

More Telugu News